KMM: గణనాథుల నిమజ్జనంలో సిబ్బంది నిర్లక్ష్యంగా, వ్యవహరించడంతో నీటిలో మునగాల్సిన గణనాథులు ఆదివారం ఖమ్మం మున్నేరు నది ఒడ్డున కనిపించాయి. భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు ఉన్నప్పటికి సరిగా నిమజ్జనం చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఒడ్డున ఉన్న విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా చూడాలని కోరారు.