ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో లబానా నాయకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు తాండాల నుంచి నాయకులు హాజరై పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ఇంఛార్జి స్థానంలో ముగ్గురు తటస్థ అధికారులను నియామకం చేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని తీర్మానించారు.