AP: యూరియా అంశంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాని ఇబ్బంది రాష్ట్రంలోనే ఎందుకు ఉంది? అని ప్రశ్నించారు. రైతులకు యూరియా అందడం లేదన్నారు. అలాగే, రుషికొండ ప్యాలెస్‌ను ప్రభుత్వ భవనంగా వినియోగించాలని చెప్పారు.