ADB: భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని CITU జిల్లా కార్యదర్శి అన్నమోల్ల కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు. బోథ్ మండలంలో స్థానికులతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. సెప్టెంబర్ 10వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించనున్న సభను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు.