MBNR: ముదిరాజ్ కుల సమస్యలు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక అంబేద్కర్ కళాభవంలో ఆయన హాజరై మాట్లాడుతూ.. ముదిరాజులకు విద్యా, వైద్యం ,ఉపాధి ,సంక్షేమ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర, జిల్లా ,మండల నేతలు పాల్గొన్నారు.