HNK: ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో ప్రైవేటు టీచర్ల సన్మాన కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ప్రతి ఉపాధ్యాయుడు తమ వ్యక్తిగత విజయానికి కాకుండా విద్యార్థుల, సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.