VZM: వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.