బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. కథ వినకుండానే ఆయన ఈ సినిమాకు అంగీకరించానట్లు తెలిపాడు. రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ వచ్చి కలవమని అడగగానే, తన పాత్ర గురించి కూడా తెలుసుకోకుండా వెంటనే ఒప్పుకున్నానని ఆయన పేర్కొన్నాడు.