MDK: పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్, మందుల రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం ప్రజలకు అందుతున్న వైద్య సహాయంపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండి సేవలు అందజేయాలని సూచించారు.