అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, అత్యాధునిక ఫైటర్జెట్లు, జలాంతర్గాములను మోహరించారు. దీంతో కరేబియన్ జలాలపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనుజువెలాలో చొరబడొచ్చని సమాచారం. కాగా, ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశంగా వెనుజువెలాకు పేరుంది.