ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు మండల, డివిజన్ స్థాయిలో కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అర్జీలను Meekosam.ap.gov.inలో చేసుకోవచ్చని వివరించారు.