ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మహిళకు 17 ఏళ్ల మైనర్ బాలుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే వారిద్దరూ కలిసి ఉండగా 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక చూసింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలికను కోరిన తన తండ్రికి చెబుతానని చెప్పడంతో ఇద్దరు కలిసి బాలికను చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.