E.G: వైసీపీ ఆధ్వర్యంలో యూరియా బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని, రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే నినాదంతో రైతుపోరు కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవరపల్లి మండల వైసీపీ శ్రేణులకు ఎంపీపీ కేవీకే దుర్గారావు పిలుపునిచ్చారు. పెద్దఎత్తున పార్టీలకతీతంగా రైతులు పాల్గొని, వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.