NZB: కమ్మర్ పల్లి మండలంలోని ప్రభుత్వ ZPHS పాఠశాలకు ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సుమారు రూ. 2లక్షల విలువ కలిగిన స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసినట్లు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం బాల్కొండలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా క్రీడ పరికరాలు అందజేసినట్లు తెలిపారు.