BDK: దుమ్ముగూడెం మండలంలో గుబ్బలమంగి పెద్దవాగులో, జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మండలానికి చెందిన చిన్న బండిరేవు గ్రామ వాసి పెనుగొండ వెంకన్న, గేదెలను మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గుబ్బలమంగి పెద్దవాగులో జారి పడి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు.