TPT: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన శివలింగంపై ఉన్న కవచంలో 27 నక్షత్రాలు, తొమ్మిది రాశులు ఉంటాయి. యావత్ సౌర కుటుంబాన్ని ఈ కవచం నియంత్రిస్తుంటుంది. ఈ మేరకు కవచంలో అన్ని గ్రహాలు ఉండటంతో వాటిపై ఆ లయకారకుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. కాగా, అందుకనే గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై పడదని చెబుతారు.