TPT: ఈ నెలలో జరిగే ఆంజనేయ స్వామి జండాలకు డీజేకి ఎటువంటి అనుమతులు లేవని గూడూరు డీఎస్పీ బీ గీతా కుమారి తెలిపారు. ఆదివారం గూడూరులో రౌడీ షీటర్లకు హామీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పండుగ వేళ ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సత్ప్రవర్తనతో మెలగాలని రౌడీలకు ఆమె హెచ్చరించారు.