AP: ఒంగోలులో వినాయక శోభాయత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్నూలు రోడ్డు నుంచి గుంటూరు రోడ్డు మీదుగా కొత్తపట్నం వెళ్లాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే, మారుతీనగర్‌కు చెందిన కొందరు యువకులు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఊరేగింపు తీసుకువెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన యువకులు ట్రాఫిక్ పోలీసులపై దాడి చేశారు.