ADB: బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తుందని ఆరోపించారు.