SRD: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా సంగారెడ్డి పట్టణానికి చెందిన మల్లికార్జున్ పాటిల్ నియమితులయ్యారు. సంగారెడ్డిలోని YSR భవన్లో మల్లికార్జున్ పాటిల్‌ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ప్రభు గౌడ్, ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి పాల్గొన్నారు.