కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తూ యువ నటీనటులతో తెరకెక్కిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా అమెరికాలో విడుదలైన తొలిరోజే 115K US డాలర్ల గ్రాస్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వసూళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ (114K), NTR చిత్రం ‘వార్-2’ (104K) కలెక్షన్లను కూడా అధిగమించాయి.