మేడ్చల్: కూకట్పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. ఆదివారం పాపారాయుడునగర్లో ఓ షాప్ ప్రారంభోత్సవానికి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పాటలకు స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో సందడిగా మారింది.