TG: రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ వస్తువుల గోదాంలో నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.