ADB: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీని నెరవేర్చుటలో విఫలమైందని MRPS జిల్లాధ్యక్షుడు ఆరేళ్లి మల్లేష్ అన్నారు. పట్టణంలోని రణదీవేనగర్లో స్థానికులతో సమావేశమై ఆదివారం మాట్లాడారు. హామీని నెరవేర్చాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ఈ నెల 8న నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.