RR: గండిపేట మండలం, గోల్కొండ రిసార్ట్స్ వద్ద గోదావరి నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో నింపేందుకు అధికారులు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. రూ. 7,360 కోట్లతో గోదావరి నుంచి ఫేజ్ 2, 3 కింద నీటిని తరలించి మూసీ నదిని పునరుజ్జీవింపజేయనున్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు లోగో ఆవిష్కరణ జరగనుంది.