అడగకుండా టాయిలెట్‌కు వెళ్లిందనే కారణంతో రెండో తరగతి విద్యార్థినితో ఓ టీచర్ 100 గుంజీలు తీయించారు. అనంతరం చిన్నారిని కర్రతో కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎక్కువ మొత్తంలో గుంజీలు తీయడంతో బాలిక కాళ్లలో కండరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.