KDP: మైదుకూరు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో కంచర్ల ఆంజనేయులు నివాసంలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ ఘటనలో బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. కాగా, ఈయన ల్యాండ్రీ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అనంతరం ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.