KDP: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష అన్నారు. ఆదివారం కడపలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో అంజాద్ భాషా మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణను వైసీపీ వ్యతిరేకిస్తుందని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని, వైసీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామన్నారు.