PPM: పాలకొండ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటరాజు ఆధ్వర్యంలో ఆదివారం స్దానిక లుంబురు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. అనధికారంగా 8 మద్యం సీసాలను కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసి సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.