ADB: సోనాల మండలానికి చెందిన మాజీ సర్పంచ్ నరోత్తం రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.