TPT: వడమాల పేట మండలంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరగనుందని నగరి ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. అనంతరం మండలానికి చెందిన ప్రజలు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.