TPT: ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వర స్వామి వారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. ఈ మేరకు మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఉండడంతో ఆలయాన్ని మూసివేసి తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణానికి కొన్ని గంటల ముందు ఆలయాలను మూసివేయడం సాంప్రదాయంగా వస్తుంది.