బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ‘దంగల్’ సినిమా సమయంలో ఆ వ్యాధి గురించి తెలిసిందని ఫాతిమా తెలిపారు. ఆ సమస్యను ఎదుర్కోవడం నేర్చుకున్నానని, అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దర్శకులకు తన సమస్య గురించి చెప్పినప్పుడు వాళ్లు సపోర్ట్‌గా నిలిచారని, మూర్ఛ వ్యాధిపై అవగాహన కల్పించడం తన బాధ్యతగా భావించినట్లు చెప్పారు.