ASF: ఆసిఫాబాద్ పట్టణంలో CPM జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, SPMలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.