TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అందరి సమన్వయంతో ఏ సమస్య లేకుండా విజయవంతం చేయాలని తిరుపతి SP హర్షవర్ధన్ రాజు కోరారు. ఆదివారం పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని అప్పుడు జరిగిన సమస్యలను గుర్తుచేస్తూ, అలాంటి సమస్య తిరిగి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు.