ASF: సిర్పూర్(టీ) మండలం పారిగాంకు చెందిన పలువురు BJP, కాంగ్రెస్ నాయకులు ఆదివారం BRSలో చేరారు. వారికి BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అస్లాం బిన్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.