NLR: బుచ్చిరెడ్డిపాళెంలో వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో మొట్టమొదటి CBSE సిలబస్‌తో విద్యాబోధన చేసే ఈ పాఠశాలకు భూమి పూజ తన చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అలాగే నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని అన్నారు.