రష్యాపై ఉపయోగిస్తున్న ఆయుధాల్లో 60 శాతం తమ దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఓ వైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ కీవ్ అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాల కోసం మిత్ర దేశాలతో చర్చలు జరపనున్నట్లు చెప్పారు.