యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే లాభాలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా దాదాపు రూ.45 కోట్లను సంపాదించినట్లు సమాచారం. దీంతో టేబుల్ ప్రాఫిట్ కింద రూ.20 కోట్లు అందుకుందని టాక్ వినిపిస్తుంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.