పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ చిత్రంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో అతను ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ తనను సంప్రదించినప్పుడు తాను చాలా ఉత్సాహానికి లోనయ్యానని హష్మీ తెలిపాడు. తన తొలి తెలుగు సినిమాలో పవన్ వంటి గొప్ప నటుడితో కలిసి నటించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు.