VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని ఓ పురాతన భవనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ కుమార్, మహేష్ కుమార్, శివకుమార్, పట్నం శ్రీనివాస్, ఎండీ ఖాజా అనే వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.