TG: మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోనని MLA కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తేల్చి చెప్పారు. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నియోజకవర్గం కోసం ఎంత త్యాగమైనా చేస్తానని.. RRR భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారని అన్నారు. ఆలస్యమైనా సరే పర్వాలేదని.. ఎదురుచూస్తానని స్పష్టం చేశారు.