KDP: ప్రజాసంకల్ప వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా రత్న అవార్డులు పలువురికి ప్రదానం చేశారు. కమలాపురం పట్టణానికి చెందిన ‘మన ఊరు సేవా సమితి’ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు మదీరె రంగ సాయిరెడ్డి చేతుల మీదుగా సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు అవార్డును స్వీకరించారు.