TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ బీసీ ద్రోహిలా మారారని మండిపడ్డారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా బండి బయటకు రావాలని సవాల్ విసిరారు. పౌరుషం ఉంటే బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురండని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎలా ఆపుతారో చూస్తామన్నారు.