MNCL: మందమర్రిలో మరో సైబర్ మోసం జరిగింది. ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ యువకుడు రూ. 50 వేల లోన్ కోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసాడు. లోన్ కావాలంటే తాము చెప్పినట్లు చేయాలని సైబర్ మోసగాళ్లు నమ్మించారు. అతడి ఆధార్, పాన్ కార్డుల వివరాలను సేకరించి, రూ. 37,500 కొట్టేశారు. తర్వాత లోన్ మంజూరు కాలేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.