SRCL: కామారెడ్డిలో ఆదివారం బీసీ డిక్లరేషన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ జరగనున్నది. కాగా ఈ సన్నాహాక సమావేశంని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.