NDL: పెండింగ్లో ఉన్న స్వచ్ఛభారత్ గ్రామీణ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి. యేసురత్నం, గ్రామీణ పారిశుద్ధ్య కార్మికుల సంఘం మండల కార్యదర్శి బి. హనుమంతు డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో ఎంపీడీవో మేరీకి వినతి పత్రం అందజేశారు.