SRD: మండల కేంద్రమైన కంగ్టిలోని రాంమందిరం నుంచి సిద్దేశ్వర ఆలయంకు గ్రామస్తులు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. చాతుర్మాస్య దీక్ష ముగింపు సందర్భంగా గోపాల్ మహారాజ్ శాస్త్రి ఆధ్వర్యంలో వార్కారి సాంప్రదాయ భజనలతో రెండు కిలోమీటర్ల దూరంలోని సిద్దేశ్వర ఆలయానికి నడిచి వెళ్లారు. మహిళలు మంగళ హరతులు నిండు కలశాలతో రాగా మరికొందరు మహిళలు కోలాటాలతో భక్తి గీతాలు ఆలపించారు.