కామారెడ్డి: రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు డాక్టర్ నవీన్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధులు దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.