NZB: మోదీ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినందుకు కృతజ్ఞతగా మోర్తాడ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వ్యవసాయ యంత్రాలు, నిత్యావసర సరుకులు, పాల ఉత్పత్తులు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.